నీట్ యూజీ ఎగ్జామ్ కు హాజరయ్యే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలు ఆంక్షలు విధించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వేసుకునే దుస్తులపై మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో పరీక్ష పేపర్ లీకైన కారణంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు.. కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పకుండా ఆంక్షలు పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సాధారణ, లేతరంగ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద బటన్లు, ఎంబ్రాయిడింగ్, ఎక్కువ ప్యాకెట్స్ ఉన్న దుస్తులు వేసుకోవడానికి వీలు లేదు. అలాగే ఫుల్ హాండ్స్ చొక్కాలు కాకుండా ఆఫ్ స్లీవ్ వేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి షూ వేసుకొని రాకూడదు. తక్కువ హిల్స్ ఉన్న సైన్డిల్స్, స్లిప్పర్స్ మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి అడ్మిట్ కార్డు తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. బంగారు ఆభరణాలను సైతం అనుమతించరు. అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితులో పరీక్షకు అనుమతించబోమని ఎన్ టిఎ స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పకుండా ఈ సూచనలు పాటించాల్సి ఉంటుంది.
నీట్ అభ్యర్థులకు ఆంక్షలు ఇవే…







