రైల్వే రీజియన్లలో అనేక విభాగాల్లో దేశవ్యాప్తంగా 6,565 టెక్నిషియల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. జూన్ 30వ తేదిన పూర్తి నోటిఫికేషన్ విడుదలకానుంది. టెక్నిషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ -323 పోస్టులు (నెలకు రూ. 29,200), టెక్నిషియన్ గ్రేడ్ -3 సిగ్నల్ -6,565 పోస్టులు ( నెలకు రూ. 19,900)భర్తీ చేయనుంది. పడవతరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిగ్రీ / డిప్లొమా చేసిన వారు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 29వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో విడుదలవుతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
రైల్వే(ఆర్ ఆర్ బీ)లో 6,565 టెక్నిషియన్ పోస్టులు..







