తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలి సెట్ ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలికలు 86.38 పాస్ కాగా.. బాలురు 79.92 శాతం పాసయ్యారు. ఓవరాల్ గా 82.94 విద్యార్థులు అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 98,029 మంది పరీక్ష రాయగా.. 81,307 మంది, బైపీసీ విభాగంలో 79, 652 మంది పరీక్ష రాయగా.. 81.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో బాలురు 52,201 మందికి గాను 41, 719 మంది అర్హత సాధించారు. బాలికల్లో 45,828 మందికి గాను 39,588 మంది అర్హత సాధించారు. బైపిసి విభాగంలో బాలురు 40,554 పరీక్ష రాయగా.. 77.69 శాతం, బాలికల్లో 39,098 మంది పరీక్ష రాయగా 85.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీవి భాగంలో 15 ర్యాంకుల్లో ఎనిమిది మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. ఎం బైపీసీ విభాగంలో మొదటి 15 ర్యాంకు సాధించిన వారిలో నలుగురు బాలికలు, 11 మంది బాలురు ఉన్నారు.
పాలిసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయి..







