ఇంజనీరింగ్ పీజీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 92.66 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. అమ్మాయిలు 94.31, అబ్బాయిలు 91.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎం ఈ, ఎంటెక్, ఏం ఫార్మసీ, మొత్తం 19 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 23,637 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 21,958 ( 92.66 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మహిళలు 13,468 మంది పరీక్షలు రాయగా 12,702 మంది, పురుషులు 10,179 మంది పరీక్ష రాయగా.. 9,256 మంది సాధించారు. జేఎన్టీయూ పరిధిలో 136 ఇంజనీరింగ్ కాలేజీలు, 72 ఫార్మసి కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీలో పరిశీలన, వాటి నాణ్యత ప్రమాణాలు గుర్తించిన తర్వాత వాటికి పర్మిషన్ ఇవ్వనున్నారు. అనంతరం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు.
పీజీ ఈసెట్ ఫలితాలు వెల్లడి







