యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాలలో వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 480 గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 480
విద్యార్హత: సంబంధిత విభాగంలో బిఈ/బీటెక్ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-01-2027 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
స్టేజ్-1 (ప్రిలిమినరీ – 500 మార్కులు), స్టేజ్-2 (మెయిన్స్ – 600 మార్కులు), స్టేజ్-3 (పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ – 200 మార్కులు) మరియు సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ. 200. (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.09.2026
చివరి తేదీ: 06.10.2026
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 31.01.2027
మెయిన్ ఎగ్జామినేషన్: 18.06.2027
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
యూపీఎస్సీ ఇంబినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్ విడుదల: 480 ఖాళీలు







