ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (SLPRB, AP) స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ప్రాతిపదికన 147 డ్రైవర్ ఆపరేటర్ (పురుషులు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 147 (డ్రైవర్ ఆపరేటర్ – పోస్ట్ కోడ్ 43)
విద్యార్హత: 1 జూలై 2026 నాటికి ఎస్ఎస్సీ (పదో తరగతి) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 సంవత్సరాల చెల్లుబాటు ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ (HTVDL) కలిగి ఉండాలి.
నెలకు రూ. 32,670 నుండి రూ. 1,01,970 వరకు (స్పెషల్ పే రూ. 650) జీతం ఉంటుంది.
సర్టిఫికేట్ పరిశీలన, దేహదారుఢ్య కొలతలు (PMT), దేహదారుఢ్య పరీక్షలు (PET – 1600 మీటర్ల పరుగు), డ్రైవింగ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఏపీ ఫైర్ సర్వీసెస్లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్







