దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సమీపించింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి రేపే ఆఖరి తేదీ. మొత్తం పోస్టులు 23,757 ఉన్నాయి. విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. ఎంపిక పదో తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
టెన్త్ అర్హతతో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్







