రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-డి పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 3 నుంచి 25 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పిడిఎఫ్ (PDF) రూపంలో రీజినల్ ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.
కీ & కటాఫ్: ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యర్థుల అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ఫైనల్ కీతో పాటు కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు.
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు.
పిఈటీలో ఉత్తీర్ణులైన వారికి వైద్య పరీక్షలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
త్వరలో ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్ష ఫలితాలు. మెరిట్ జాబితా విడుదలకు ఏర్పాట్లు







