సద్భావ్ ఫ్యూచర్టెక్ లిమిటెడ్ (Sadbhav Futuretech Limited) సంస్థ అప్రెంటిస్ ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 నెలలు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,000 నుండి రూ. 18,000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
పని ప్రాంతాలు: రామచంద్రాపురం, విజయనగరం, టెక్కిలి, చీరాల, నర్సీపట్నం, పాలకొండ, నాసిక్, నరసాపురం, తాడేపల్లిగూడెం, పెద్దాపురం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
కావలసిన నైపుణ్యాలు: క్లయింట్ ఇంటరాక్షన్ మరియు క్లయింట్ రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్, కస్టమర్ సపోర్ట్ మరియు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ వర్క్ మరియు రిపోర్ట్ జనరేషన్ నైపుణ్యాలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు 19 అక్టోబర్ 2026 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు
సద్భావ్ ఫ్యూచర్టెక్ లిమిటెడ్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు








