బి బి ఏ, బీసీఏ కోర్సులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రెన్స్ ద్వారా స్వీట్లు భర్తీ చేయనున్నట్టు సమాచారం. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కోర్సులు కొన్ని డిగ్రీ కాలేజీల్లో ఉన్నాయి. ఇప్పటివరకు వీటిలో ప్రవేశాల కోసం మార్కుల ఆధారంగా దోస్తు ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. ఈ మూడు కోర్సులకు ఇప్పటివరకు వర్సిటీలు అనుమతి ఇచ్చేవి కానీ తమ నుంచి కూడా అనుమతి పొందాలని అఖిలభారత సాంకేతిక విద్య మండలి 2025 లో వెల్లడించింది. తమకు మూడేళ్ల సడలింపు కావాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరింది. ఈ విద్యా సంవత్సరంతో ఆ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో పైన పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలోని సీట్లను ప్రవేశ పరీక్ష ఆధారంగా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.







