‘సీఎస్ఐఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’ (IICT) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టులలో 91 పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ప్రాజెక్ట్ అసోసియేట్ (I, II), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-I, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I, ప్రాజెక్ట్ అసిస్టెంట్-II, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III పోస్టులు ఖాళీలు ఉన్నాయి
పోస్టును బట్టి B.E/B.Tech, B.Sc, M.Sc, M.Pharm, M.Tech, Ph.D తో పాటు అనుభవం, NET/GATE అర్హతలు ఉండాలి.
నెలకు ₹20,000 నుండి ₹57,000 వరకు జీతం ఉంటుంది.
వయస్సు ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 నుండి 50 ఏళ్లు మించకూడదు. (SC/ST/OBC, మహిళలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 18, 19, 20, 21.
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు మాత్రమే.
అడ్రెస్: సీఎస్ఐఆర్ – ఐఐసీటీ, హైదరాబాద్.
అర్హత ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన వేదిక వద్ద నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
హైదరాబాద్ CSIR-IICT లో 91 ప్రాజెక్ట్ ఉద్యోగాలు







