రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) భారీ ఉద్యోగాల ప్రకటన విడుదల అయింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 4,098 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపర్వైజర్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 14 నుండి ప్రారంభం కానుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో CBT-1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 13. పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్: 4,098 ఉద్యోగాల భర్తీ!







