ఎమ్ఎస్ఎమ్ఈ టూల్ రూమ్ హైదరాబాద్‌లోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్’ (సీఐటీడీ) 2026 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ (మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల అయింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో అందిస్తున్న ఈ రెండేళ్ల (4 సెమిస్టర్లు) ఫుల్‌టైమ్ ఎంఈ (టూల్ డిజైన్) కోర్సు ద్వారా టూల్ డిజైన్, తయారీ, ఇంజనీరింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 55% మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.750. ఉంటుంది. సీఐటీడీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గేట్ ర్యాంకర్లు కూడా ఈ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. పరీక్ష 1 గంట పాటు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో హైదరాబాద్‌లోని సెంటర్లో జరుగుతుంది. ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 26-08-2026, ప్రవేశ పరీక్ష తేదీ: 02-09-2026 నిర్వహిస్తారు.
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ కోర్సులో ప్రవేశాలు







