Trending Posts

ప్రభుత్వ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి గాను 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి (CRP CSA-XVI) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 186, తెలంగాణలో 191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
​ముఖ్యమైన వివరాలు:
​అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని డిగ్రీ ఉత్తిర్ణులై ఉండాలి. ఆగస్టు 21, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు స్థానిక భాష పరిజ్ఞానం తప్పనిసరి.
​వయోపరిమితి: ఆగస్టు 1, 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
​జీతం: బేసిక్ పే రూ.24,050 – రూ.64,480 తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
​ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
​ముఖ్యమైన తేదీలు:
​ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.08.2026
​చివరి తేదీ: 21.08.2026
​ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 2026
​మెయిన్స్ పరీక్ష: డిసెంబర్ 2026
​ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21 నాటికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/