తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి అందిస్తున్న ఈ పాస్ పోస్ట్ – మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును పొడిగించింది. గతంలో ఏప్రిల్ 20 తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ తేదీని మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వారితోపాటు రెన్యువల్ చేసుకునే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, బిసి, ఈ బీసీ, మైనార్టీ, శారీరక వికలాంగులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం అర్హులైన విద్యార్థులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.
స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు







