DRDA/CORPORATE ADMISSION 2026 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియేట్ అడ్మిషన్ల కోసం డీఆర్డీఏ(డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్ మెంట్ అథారిటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
2025-26 అడమిక్ ఇయర్ లో టెన్త్ క్లాస్ లో 400కు పైన మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హత గల వారు జూన్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం https://telanganaepass.cgg.gov.in/CorporateApplicationForm.do వెబ్ సైట్ ను సంప్రదించండి.

దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సినవి
ఈపాస్ వెబ్ సైట్ లో అప్లై చేసేందుకు టెన్త్ హాల్ టికెట్, ఆన్ లైన్ ఎస్ ఎస్ సీ మార్క్ షీట్, ఆదాయం సర్టిఫికెట్- ఆరు నెలల లోపు తీసి ఉండాలి, ఆధార్ కార్డు, ఫోటో, మెయిల్ ఐడి, తల్లిదండ్రుల వివరాలు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్, నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించిన విద్యా సర్టిఫికెట్లు అవసరం ఉంటాయి. . అర్హులైన విద్యార్థులు జూన్ 6వ తేదీలో గా దరఖాస్తు చేసుకోవాలి.







