ఎం ఈ , ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET పరీక్షలు మే 29 నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షల కోసం 26085 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. హైదరాబాద్ లో 24 సెంటర్లు, వరంగల్లో 7 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి PGECET పరీక్షలు ప్రారంభం






