రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్ల లో బోధించుటకు ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఇంటర్ చేసి ఉండాలి. అయితే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్‌లో క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్, నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, రెండేళ్లకు తక్కువ కాకుండా ఉండే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి , అలాగే బీఈడీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం కొత్తగా 2,769 పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో గ్రామంలో ఉన్న వారికి ఉపాధి లభించనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు






