జూన్ 21వ తేదీన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఉంది. ఈ నేపథ్యంలో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ స్లిప్పులతో అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకుని అవకాశాన్ని కల్పించింది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ సహకారంతో లాగిన్ అయి ఈ విషయాలు తెలుసుకోవచ్చు. అయితే అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల చేయనుంది. భారతదేశంలోని 551 నగరాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో పునః పరీక్ష నిర్వహించనుంది. ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అడ్మిట్ కార్డు కాదనేది గుర్తించాల్సి ఉంటుంది. కేవలం అభ్యర్థి సెంటర్ తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే గతంలో మే 3 న నిర్వహించిన నీటి పరీక్ష రేపల్లె లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. పలువురు విద్యార్థులు సైతం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ నీట్ పరీక్షను 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
జూన్ 21న నీటి ఎగ్జామ్






