నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,242 పోస్టులు ఉన్నాయి. నేటి (జూన్ 30) నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29లోపు అధికారిక RRB వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రేడ్-1 పోస్టులకు 18–33 ఏళ్లు, గ్రేడ్-3 పోస్టులకు 18–30 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుంది. విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలని అధికారులు సూచించారు.
రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్..







