పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతుంది. మొత్తం పోస్టుల ఖాళీలు 100. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ ): 52, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్):20, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(మెకానికల్):21, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్):07 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు అర్హులు. వయసు 2026జులై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. నెలకు రూ. 75,000 ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత రూ. 86,245 నుంచి 2,08,915 వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది జులై 20. దరఖాస్తు రుసుము రూ. 1000. పూర్తి సమాచారం కోసం https://apgenco. gov. in వెబ్ సైట్ లో చూడవచ్చు.
జెన్ కో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..







