నిరుద్యోగ యువతకు శుభవార్త. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 800 ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 12న జాబ్‌మేళా నిర్వహించనున్నారు.మొత్తం ఖాళీలు 800 ఆపరేటర్ పోస్టులు
విద్యా అర్హత పదో తరగతి (SSC) నుంచి డిగ్రీ, బీటెక్ వరకు
వయస్సు 18 నుంచి 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం నెలకు రూ. 15,500 నుంచి రూ. 16,500 వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వివరాలు
12-09-2026 తేదీన ఉంటుంది
వేదిక: సర్ సీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ (SIR CRR Degree College), ఏలూరు
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలు, ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్‌లో 800 ఆపరేటర్ పోస్టులు: రేపే ఏలూరులో జాబ్‌మేళా!







