తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అండర్‌గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ (ఆనర్స్), బీఏ (ఆనర్స్), బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగాల్లో మొత్తం 130 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల వివరాలు & అర్హతలు:
బీఎస్సీ/బీటెక్: ఇంటర్‌మీడియట్‌లో కనీసం 60% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
ఎంపిక విధానం: సీయూఈటీ (CUET) యూజీ, జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను ఇంటర్ మార్కుల మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు.
దరఖాస్తు రుసుము:
జనరల్/OBC/EWS: రూ. 300 (బీఏ), రూ. 500 (బీటెక్, బీఎస్సీ)
SC/ST/దివ్యాంగులు/మహిళలు: రూ. 150 (బీఏ), రూ. 250 (బీటెక్, బీఎస్సీ)
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూలై 23, 2026
చివరి తేదీ: ఆగస్టు 3, 2026
మెరిట్ జాబితా: ఆగస్టు 5, 2026
కౌన్సెలింగ్ తేదీ: ఆగస్టు 11, 2026
అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ https://ssctucuet.samarth.edu.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు







