నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (NIFTEM), కుండ్లీ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ లేదా సంబంధిత సైన్స్ విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 2026 అక్టోబరు 2 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ఐఎఫ్టీఈఎమ్లో ఎస్ఆర్ఎఫ్ ఖాళీలు అక్టోబర్ 2 వరకు దరఖాస్తుకు అవకాశం







