ప్రముఖ ఐటీ దిగ్గజం సిస్కో (Cisco) బెంగళూరులోని తన కార్యాలయంలో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ – టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్య వివరాలు:
అర్హత: బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన 2025, 2026 బ్యాచ్ ఫ్రెషర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వేతనం: ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి సుమారు రూ.6.5 లక్షల వరకు వేతనం లభిస్తుంది.
నిబంధనలు: అభ్యర్థులు NATS వెబ్సైట్లో నమోదై చెల్లుబాటు అయ్యే ఎన్రోల్మెంట్ నంబర్ కలిగి ఉండాలి మరియు సెప్టెంబర్ 2026 నుంచి 12 నెలల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న ఫ్రెషర్లు https://tinyurl.com/cisco-freshers-recruitment ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సిస్కో సంస్థలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు: రూ.6.5 లక్షల వార్షిక వేతనం







