Trending Posts

​STEM చదివే విద్యార్థినులకు ‘DXC స్కాలర్‌షిప్’.. రూ.50 వేల ఆర్థిక సాయం!
​DXC టెక్నాలజీ సంస్థ తన CSR కార్యక్రమంలో భాగంగా “DXC Progressing Minds Scholarship for Graduation Students in STEM 2026-27” ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్న మహిళా, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఒకేసారి రూ. 50,000 ఆర్థిక సాయం అందుతుంది.
​అర్హతలు:
​STEM విభాగంలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న దేశవ్యాప్త మహిళా, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు అర్హులు.
​గత సెమిస్టర్ లేదా సంవత్సరంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
​కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 4 లక్షలకు మించకూడదు.
​DXC Technology, Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అనర్హులు.
​దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన విద్యార్థులు www.b4s.in/yeks/DXCS8 వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 15, 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/