లోటస్ పెటల్ ఫౌండేషన్ (Lotus Petal Foundation) తమ కార్పొరేట్ భాగస్వామ్య సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళా విద్యార్థుల కోసం ‘విన్నీ సన్ స్కాలర్‌షిప్ 2026-27’ (Winnie Sun Scholarship 2026-27) ను అందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరంలో MBBS కోర్సులో ప్రవేశం పొందిన భారతీయ మహిళా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థినులకు వారి కోర్సు కాలపరిమితి పూర్తయ్యే వరకు సంవత్సరానికి రూ.65,000 వరకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
అర్హతలు:
2026-27 విద్యా సంవత్సరంలో MBBS మొదటి సంవత్సరంలో ప్రవేశం పొంది ఉండాలి.
10వ, 12వ తరగతి పరీక్షల్లో కనీసం 70 శాతం మార్కులు (SC/ST/OBC వర్గాల విద్యార్థులకు 60 శాతం) సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
దరఖాస్తు వివరాలు:
ఈ స్కాలర్‌షిప్‌కు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు www.b4s.in/yeks/WISS2 వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 30, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
మహిళా MBBS విద్యార్థులకు ‘విన్నీ సన్ స్కాలర్‌షిప్ 2026-27’.. ఏడాదికి రూ.65,000 ఆర్థిక సాయం!







