రాష్ట్రంలో ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఇజ్రాయెల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో చోట 50 మంది చొప్పున తొలి విడతగా 100 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
అర్హతలు: ఇజ్రాయెల్లో డిమాండ్ ఉన్న ‘హోమ్ బేస్డ్ కేర్గివింగ్’ కోసం ఏఎన్ఎమ్, జీఎన్ఎమ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు అర్హులు.
శిక్షణా కేంద్రాలు: నర్సింగ్ అభ్యర్థుల కోసం విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు పట్టణాలను ఎంపిక చేశారు.
ఇతర వృత్తులు: శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురం కేంద్రాల్లో మహిళలతో పాటు పురుషులకు ఇతర వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారు.
ఎస్సీ యువతకు ఇజ్రాయెల్లో ఉపాధి









