డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC) జులై 2027 టర్మ్‌కు సంబంధించి 8వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఆర్‌ఐఎమ్‌సీ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2026 (RIMCEE-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొదటి దశ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 2027 జులై 1 నాటికి 12 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండాలి (02-07-2013 నుండి 01-01-2015 మధ్య జన్మించి ఉండాలి).
దరఖాస్తు విధానం: ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/డిఫెన్స్/ఓబీసీలకు రూ. 1,000; ఎస్సీ/ఎస్టీలకు రూ. 750.
చివరి తేదీ: 2026 సెప్టెంబరు 30 (ఆలస్య రుసుముతో అక్టోబరు 07 వరకు).
రాత పరీక్ష తేదీ: 2026 డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్‌ఐఎమ్‌సీ డెహ్రాడూన్‌లో 8వ తరగతి ప్రవేశాలు









