మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లోని మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ (MTPF – AVNL) 61వ బ్యాచ్ కింద 162 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు (మొత్తం 162): నాన్-ఐటీఐ: 83, ఎక్స్-ఐటీఐ: 79.
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎమ్‌టీఎమ్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్.
అర్హతలు: 10వ తరగతి లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: పోస్టును బట్టి నెలకు రూ. 12,600 నుంచి రూ. 16,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలను జతచేసి ఆఫ్‌లైన్ ద్వారా ‘చీఫ్ జనరల్ మేనేజర్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, అంబర్‌నాథ్’ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: సెప్టెంబరు 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంటీపీఎఫ్ అంబర్‌నాథ్‌లో 162 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు










