ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) దేశవ్యాప్తంగా 7,267 ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి టైర్-2 పరీక్షల ఫలితాలను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) విడుదల చేసింది.
ఈ మార్చి 22 నుంచి 25 వరకు నిర్వహించిన టైర్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్ వివరాలను నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు nests.tribal.gov.in లేదా cbse.gov.in ద్వారా తమ ఫలితాలు, స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఏకలవ్య మోడల్ స్కూల్స్ టైర్-2 ఫలితాలు విడుదల







