తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్/తాత్కాలిక ప్రాతిపదికన 149 పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు: ప్రొఫెసర్ (08), అసోసియేట్ ప్రొఫెసర్ (19), అసిస్టెంట్ ప్రొఫెసర్ (62), ట్యూటర్ (10), జూనియర్ రెసిడెంట్ (50).
అర్హత: సంబంధిత విభాగంలో MBBS, MD/MS/DNB పూర్తి చేసి ఉండాలి. సీనియర్ పోస్టులకు బోధనానుభవం తప్పనిసరి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
వేతనం: పోస్టును బట్టి నెలకు రూ. 46,000 నుంచి రూ. 1,90,000 వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 15, 2026. (ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 17, 2026).
వేదిక: ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఏదిర క్యాంపస్, తిరుమల హిల్స్, మహబూబ్‌నగర్.
ఆసక్తి ఉన్నవారు www.gmcmbnr-ts.org నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 149 పోస్టులు







