ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో HDFC బ్యాంక్ తన సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా ‘పరివర్తన్ ECSS ప్రోగ్రామ్ 2026-27’ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులతో పాటు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులు అభ్యసిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు. విద్యార్థుల విద్యార్హత స్థాయిని బట్టి గరిష్టంగా రూ. 75,000 వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
మునుపటి విద్యార్హత పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ. 2.5 లక్షలకు మించకూడదు.
గత మూడేళ్లలో కుటుంబంలో లేదా వ్యక్తిగతంగా ఏదైనా తీవ్రమైన ఆర్థిక/ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
ఈ స్కాలర్షిప్నకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు www.b4s.in/yeks/HDFC63 లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 31, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలని సూచించారు.
1వ తరగతి నుంచి PG వరకు ‘పరివర్తన్ ECSS’ స్కాలర్షిప్: రూ. 75,000 వరకు ఆర్థిక సాయం







