Trending Posts

దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లో 1,871 ఎస్ఐ ఉద్యోగాలు

​స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు 1,871 ఉన్నాయి.
​సీఏపీఎఫ్‌లో ఎస్ఐ (జీడీ) 1,320
​దిల్లీ పోలీస్ ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్): పురుషులు – 205, మహిళలు – 112
​సీఏపీఎఫ్‌లో ఎస్ఐ (ఫైర్ – పురుషులు): 234
​అర్హతలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఫైర్ పోస్టుకు సైన్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి. దిల్లీ పోలీస్ ఎస్ఐ (పురుషులు) పోస్టుకు ఎల్‌ఎమ్‌వీ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
​వయస్సు 01.08.2026 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి (ఫైర్ పోస్టుకు 18-30 ఏళ్లు). నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
​జీతం నెలకు ₹35,400 నుండి ₹1,12,400 వరకు ఉంటుంది.
​ఎంపిక విధానం సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు (PET/PST), మెడికల్ పరీక్ష ఆధారంగా.
​దరఖాస్తు ఫీజు ₹100. (SC/ST/మహిళలు/మాజీ సైనికులకు ఫీజు లేదు). ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 10.09.2026 నుంచి ​30.09.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/