దేశంలోని రీజనల్ రూరల్ బ్యాంకుల (RRB) లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్సస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్సస్): 8,183 పోస్టులు.
ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్): 4,256 పోస్టులు.
ఆఫీసర్ స్కేల్-2 & 3: 1,267 పోస్టులు.
అర్హత & వయోపరిమితి
పోస్టును బట్టి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, MBA లేదా CA ఉత్తీర్ణులై ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18-28 ఏళ్లు, స్కేల్-1 కు 18-30 ఏళ్లు వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్ 01, 2026,
దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026 వరకు చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్ పరీక్షలు నవంబర్/డిసెంబర్ 2026, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.ibps.in ను సంప్రదించండి
గ్రామీణ బ్యాంకుల్లో 13,706 పోస్టులకు భారీ నోటిఫికేషన్: డిగ్రీ అర్హతతో మంచి అవకాశం!







