పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ‘యుజీ స్కాలర్‌షిప్ 2026-27’ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 5,000 మంది విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఉపకార వేతనం అందించనున్నారు.
ఇంటర్మీడియట్ / 12వ తరగతిలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 2026-27 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీలో ఫుల్-టైమ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 15 లక్షలకు మించకూడదు.
అభ్యర్థుల ఎంపిక ఆన్-లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, అకడమిక్ ప్రతిభ మరియు వ్యక్తిగత వివరాల ఆధారంగా ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 5, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిలయన్స్ ఫౌండేషన్ యుజీ స్కాలర్‌షిప్ 2026-27. డిగ్రీ విద్యార్థులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం







