Trending Posts

RRB ఉద్యోగ ప్రకటన: 3,477 ఖాళీల భర్తీకి షార్ట్ నోటీస్ విడుదల

​రైల్వే ఉద్యోగార్థులకు శుభవార్త. NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్‌మెంట్-2026 కింద మొత్తం 3,477 ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) షార్ట్ నోటీస్‌ను విడుదల చేసింది.
​ఈ నోటిఫికేషన్ ద్వారా గుడ్స్ ట్రైన్ మేనేజర్ (2,750), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (371), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (300), మరియు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ (56) పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
​ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫుల్ నోటిఫికేషన్ అక్టోబర్ 7న విడుదల కానుంది. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వైబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/