నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నీట్ పీజీ 2026 ఫలితాలను గురువారం మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించింది. బోర్డు అభ్యర్థుల అప్లికేషన్ సీక్వెన్స్ నంబర్, రోల్ నంబర్, పొందిన స్కోరు, కేటాయించిన ర్యాంకులు మరియు కేటగిరీల వారీ కటాఫ్ స్కోర్లను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఆగస్టు 30న జరిగిన పరీక్షకు 2,63,544 మంది, సెప్టెంబర్ 5న జైపూర్ కేంద్రంలో జరిగిన పరీక్షకు 2,416 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్ కార్డులను అక్టోబర్ 1 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ 2026 ఫలితాలు విడుదల







