భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియా ఆప్టెల్ లిమిటెడ్’ ఒప్పంద ప్రాతిపదికన 160 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ టెక్నీషియన్ (98), జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ (57), వెల్ఫేర్ ఆఫీసర్ (03), కన్సల్టెంట్ (02) పోస్టులు ఉన్నాయి.
పోస్టును బట్టి 10వ తరగతితో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్ పోస్టులకు ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్లు అర్హులు. పోస్టును బట్టి వేతనం నెలకు రూ.20,000 నుండి రూ.1,40,000 వరకు ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 03, 2026 నాటికి దరఖాస్తు చేసుకోవాలి.
ఇండియన్ ఆప్టెల్లో 160 ఉద్యోగాలు







