ప్రభుత్వ, ప్రైవేట్ ITI కాలేజీల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ తరగతి లేదా పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత జులై 2 వ తేదీలోపు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సమీప ప్రభుత్వ ITI కాలేజీలో అందజేయాల్సి ఉంటుంది. విద్యార్థి కనీస వయసు 14 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు పరిమితి ఏమీ లేదు. ITI లోని వివిధ కోర్సులకు గాను సీట్లు భర్తీ చేయనుంది. అయితే విద్యార్థులు దరఖాస్తు చేసుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి తీసుకోవాలి. వ్యక్తిగత, విద్య అర్హత తో పాటు ITI/ ట్రేడ్ వివరాలను ప్రాధాన్యత క్రమంలో పొందుపరచాలి. దరఖాస్తును, ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపల్ తో అప్రూవల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును విడుదల చేస్తారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్ కి అవకాశం కల్పిస్తారు. ఐటిఐ లో చేరి భవిష్యత్తును ఉన్నంతంగా తీర్చిదిద్దాలనుకున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు.
AP ITI కాలేజీలో ప్రవేశాలు







