Trending Posts

నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్

వేల సంఖ్యలో ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI) లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. దేశవ్యాప్తంగా 7150 పోస్టులను భర్తీ చేయనున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 491 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ పోస్టుకు అర్హులు అవుతారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్బిఐ కానీ ఇతర బ్యాంకుల్లో అప్రెంటి స్ చెయ్యొద్దు. అభ్యర్థి వయసు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పిడబ్ల్యూ బీడీలకు పదేండ్ల సడలింపును ఇచ్చింది. మే 19వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రెండు దశల్లో అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు WWW. SBI.co.in/careers సైట్ ను సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/