2026 27 విద్యా సంవత్సరానికి గాను ఐటిఐ లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో ద్వారా స్వీకరించనుంది. పదో తరగతి పాసైన వారు దీనికి అర్హులవుతారు. కొన్ని కోర్సులకు మాత్రం 8వ తరగతి ఉన్న పర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీ సెంటర్లు, 63 ప్రభుత్వ ఐటిఐలు, 230 ప్రైవేట్ ఐటిఐ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. 47 ట్రేడ్ లో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు కనీసం 14 ఏళ్ల అయినా ఉండాలి. డ్రోన్ కోర్సులో చేరడానికి కనీసం పాదారేండ్లు ఉండాలి. అయితే గరిష్ట వైయోపరిమితి మాత్రం ఏం లేదు. iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. మే 25వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఐటిఐ చేయాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ITI లో ప్రవేశానికి దరఖాస్తులు







