శ్రీ పద్మావతి విశ్వ విద్యాలయం (తిరుపతి) లో 2026-2027 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవలసిన కోర్సులు : సర్టిఫికెట్ కోర్సులో 15 నుంచి 25 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఈ కోర్సుకు పదవ తరగతి పాసైనా లేదా ఫెయిల్ అయినా వారు అర్హులు. ఈ కోర్సు 3 నెలల వ్యవధి ఉంటుంది.
పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులో 60 సీట్లు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ లో మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు. కోర్సు కాలం సంవత్సరం ఉంటుంది.
డిప్లొమా ఇన్ యోగా కోర్స్ కు ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు. ఈ కోర్స్ వ్యవధి సంవత్సరం ఉంటుంది.
పీజీ డిప్లొమా ఇన్ యోగా.
ఈ కోర్స్ కు ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. వ్యవధి సంవత్సరం. పీజీ డిప్లొమా డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్సుకు రూ. 500,ఇతర కోర్సులకు రూ. 150 దరఖాస్తు రుసుము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 15 తేదీ వరకు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేయనుకునే విధానం : పూర్తి చేసిన ఆఫ్లైన్ దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు, డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి అడ్రెస్ కు పంపించాలి.
SPMVV లో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు ప్రవేశాలు..







