EIL(ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్) లో అనేక విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటన వెళ్లడైంది. అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ -2 పోస్టులు 15, అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ -3 పోస్టులు 26 ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు. గ్రేడ్ -2 పోస్టులకు 37 ఏళ్ల వయసు, గ్రేడ్ -3 పోస్టులకు 41 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. నెలకు రూ. 72,000 నుంచి రూ. 96,000 వరకు ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. ఇంటర్వ్యూ తేది జులై 13. పూర్తి సమాచారం కోసం www.engineers india. Com/ వెబ్ సైట్ లో సంప్రదించండి.
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు..







