ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 254 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఖాళీల సంఖ్య: 254. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 196 పోస్టులు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఎకనమిక్స్, స్టాటిస్టికల్): 17 పోస్టులు. అనలిస్ట్ గ్రేడ్-2 (కాలుష్య నియంత్రణ మండలి): 18 పోస్టులు
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్: 12 పోస్టులు. ఆంగ్ల భాష రిపోర్టర్లు (అసెంబ్లీ): 10 పోస్టులు. తెలుగు భాష రిపోర్టర్ (అసెంబ్లీ): 1 పోస్టు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. (అభ్యర్థులు మొదట OTPR నమోదు చేసుకోవాల్సి ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 13 అక్టోబర్ 2026. దరఖాస్తులకు చివరి తేదీ 02 నవంబర్ 2026. అధికారిక వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ 254 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం!







