ఆంధ్రప్రదేశ్లోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అనుబంధ శాఖల్లో ఖాళీగా ఉన్న 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు: సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 41 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్: 23 పోస్టులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్: 33 పోస్టులు. వివిధ విభాగాలకు సంబంధించి గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు బి.ఎడ్ (B.Ed), డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు వేతనం లభిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), సర్టిఫికెట్ల పరిశీలన మరియు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 300 మార్కులకు (జనరల్ స్టడీస్ 150, ఎడ్యుకేషన్ పేపర్ 150) ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ విధానం వర్తిస్తుంది. దరఖాస్తులు అక్టోబరు 09 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబరు 29, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 గా నిర్ణయించారు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది). పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్








