Trending Posts

IOCL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ విడుదల.. 58 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

​భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కి చెందిన బంగైగావ్ రిఫైనరీ.. 2026-27 సంవత్సరానికి గాను అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య: 58. ​అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్): 36 పోస్టులు. టెక్నీషియన్ అప్రెంటిస్ (బాయిలర్ – మెకానికల్): 14 పోస్టులు. టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 8 పోస్టులు. సంబంధిత విభాగాలలో బీఎస్సీ (B.Sc – మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ​దరఖాస్తుకు చివరి తేదీ: 18 అక్టోబర్ 2026. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను (https://iocl.com/) సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/