Trending Posts

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘అపార్’ కార్డులు డిజి లాకర్‌తో విద్యాఅర్హతలు సురక్షితం

​డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను డిజి లాకర్‌లో భద్రపరిచేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. దూరవిద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌తో ఉండే ‘అపార్’ (APAAR – ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులను జారీ చేయడం ఇదే తొలిసారి. గత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు దాదాపు 1.2 లక్షల మంది విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిననాటి నుంచి కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థి వివరాలు, విద్యాఅర్హతలు, సాధించిన విజయాలను అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ABC) అనే ఎడ్యులాకర్‌లో ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లే విద్యార్థుల ధృవపత్రాల ప్రామాణికతను (నకిలీవా? నిజమైనవా?) సంస్థలు, బ్యాంకులు డిజి లాకర్ ద్వారా సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. ఇది విద్యార్థుల వివరాలకు పూర్తి రక్షణ కల్పిస్తూ వారి భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/