Trending Posts

జూన్ 2న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ రెండున ఇందిరమ్మ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కుటుంబంలో పెద్ద ఏ కారణం చేతనైనా చనిపోతే.. ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సావలంబన లభించనుంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఈ పథకం పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4000 కోట్ల నిధులను కేటాయించింది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన తర్వాత ప్రజలు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు , పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం, తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పథకం ప్రారంభం అనంతరం దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/