యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ (64), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (140), అసిస్టెంట్ ఎడిటర్ (02), లా ఆఫీసర్ (04), స్పెషలిస్ట్ గ్రేడ్-II (02) వంటి పోస్టులు ఉన్నాయి.
విభాగాలు: అనాటమీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియాలజీ, పిడియాట్రిక్స్ తదితర విభాగాలు ఉన్నాయి.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విభాగాల వారీగా UR/EWS కు 40 ఏళ్లు, OBC లకు 43 ఏళ్లు, SC/ST లకు 40-45 ఏళ్లుగా నిర్ణయించారు. పే లెవల్ 10, 11 ప్రకారం జీతం చెల్లిస్తారు. జనరల్/OBC/EWS అభ్యర్థులకు ఫీజు రూ. 25 కాగా, SC/ST/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.
రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 2, 2026 (లద్దాఖ్ పోస్టులకు అక్టోబరు 09).
యుపిఎస్సి నుండి 212 స్పెషలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నేడే చివరి తేది







